ఈరోజు బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది ఆర్సీబీ. ఈ సీజన్ లో నాలుగో ప్లేస్ లో ఉన్న బెంగుళూరుకు పెద్ద లోటు ఏంటంటే చిన్న స్వామి స్టేడియమే. హోం గ్రౌండ్ అనే మాటే కానీ ఈ సీజన్ లో ఇక్కడ ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు కు మూడు మ్యాచులు ఓడిపోయింది ఆర్సీబీ. హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది వాడుకోని టీమ్ అనేది ఏదైనా ఉందీ అంటే అది ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీనే. ఆర్సీబీ టీమ్ చిన్న స్వామిలో ఓడిపోయినన్ని మ్యాచులు మరే టీమ్ కూడా తమ హౌం గ్రౌండ్ లో ఓడపోలేదు. మరి అలాంటిది సొంతగడ్డలపై ఓటముల పరంపర కు ఆర్సీబీ ఈ రోజు బ్రేక్ వేయనుందా. ఎందుకంటే ఆర్సీబీ బయట ఆడిన ఐదు మ్యాచుల్లో ఐదుకు ఐదుకు విజయం సాధించింది. ప్రాబ్లమంతా బెంగుళూరు గ్రౌండ్ లోనే. సో ఇక్కడ కూడా ఒకటి రెండు విజయాలు సాధిస్తే..ప్లేఆఫ్స్ కోసం ఆర్సీబీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కొహ్లీ ఎక్కువ సేపు ఆడాలని ఆర్సీబీ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. పటీదార్ ఫామ్ లో ఉండటం..లాస్ట్ మ్యాచ్ తో పడిక్కల్ కూడా ఫామ్ లోకి రావటం ఆర్సీబీకి కలిసి వచ్చే అంశం. అవసరమైనప్పుడు ఆదుకోవటానికి టిమ్ డేవిడ్ ఉన్నాడు. బౌలింగ్ లో హేజిల్ వుడ్..భువీ కొండంత అండలా నిలుస్తున్నారు ఆర్సీబీకి. ఇటు రాజస్థాన్ పరిస్థితి చూస్తే పాయింట్స్ టేబుల్ లో 8వ స్థానంలో ఉంది RR. రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ కి గాయం కావటంతో పరాగ్ లీడర్ షిప్ లో ఆడాల్సి వస్తోంది రాజస్థాన్ కి. కానీ పరాగ్ క్రూషియల్ టైమ్స్ లో అనుభవలేమి చేతులెత్తేస్తున్నాడు. వైభవ్ సూర్యవంశీ లాంటి కొత్త కుర్రాడు చిన్న పిల్లాడైనా మొదటి మ్యాచ్ లోదుమ్ములేపటం..యశస్వి జైశ్వాల్ బీభత్సమైన ఫామ్ లోకి రావటం రాజస్థాన్ కు సానుకూలాంశాలు. సందీప్ శర్మకు కొహ్లీ పై మంచి రికార్డు ఉంది. సందీప్ కి తోడుగా జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్ పాండే కలిసి వస్తే ఆర్సీబీని మళ్లీ హోం గ్రౌండ్ లో ఓడించొచ్చు. చూడాలి ఈ రోజు ఏం జరగనుందో.